ఇంట్లోంచే లక్షలు సంపాదిస్తుంది

ఇంట్లోంచే  లక్షలు సంపాదిస్తుంది
ఏదో ఒక అంశాన్ని ఎన్నుకుని, దాని గురించి అవసరమైన పరిజ్ఞానం సంపాదించి, అందమైన గొంతుకతో మాట్లాడుతూ వీడియోల్లో అద్బుతంగా విషయాన్ని వివరించే 20 ఏళ్ల బెథాని మోటా, ఇప్పుడు ప్రపంచం లో అత్యధికంగా సంపాదించే వ్యక్తిగత యుట్యూబ్ చానెల్ కి ఓనర్. ఇప్పుడు ఆమె వీడియోలలో చిన్న చిన్న టిప్స్ నుండి  బరాక్ ఒబామాను ఇంటర్వ్యూ వరకు ఉన్నాయి.

2009 లో బెథాని మోటా సరదాగా Macbarbie07 పేరుతో మొదలు పెట్టిన యుట్యూబ్ చానెల్ ఆమెకు సిరులు కురిపిస్తోంది. ఆమె  ఔట్ ఫిట్ ఐడియాలు, మేకప్ టిప్స్, హెయిర్ ట్యూషన్స్, రెసిపీస్, డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఐడియాలు, మోటివేషన్ క్లాసులు లాంటి వీడియోలతో ప్రారంభించిన ఆమె ఈ మధ్య ప్రముఖులతో ఇంటర్వ్యూలు కూడా రూపొందించం మొదలుపెట్టింది. ఆమె ప్రతీ వీడియో ఒక సంచలనమే. ఈ చానెల్ కు ఇప్పుడు 10 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె 40  వేల డాలర్ల పైమాటే.

బెథాని ఇప్పుడు ఫరెవర్ 21, జేసీ పెన్నీ స్టోర్స్ తో వారి ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు భారీ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. అంతేకాకుండా మోటా-వేటర్  పేరుతో ప్రజల్ని మోటివేట్ చేయటానికి ప్రసంగాలు కూడా ఇస్తుంది. ఆమె ప్రయత్నాలకు గుర్తింపుగా 2015లో టీన్ ఛాయిస్ అవార్డు కూడా గెలుచుకుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post