ఈ ఏడాది వర్షపాతం బాగుంటుంది |
ఎల్‌నినో ప్రభావం తగ్గుతుండటం తో ఈ సంవత్సరం ఇండియాలో ఎక్కువ వర్షపాతం నమోదవనుందని భారత వాతావరణ సంస్థ, స్కైమెట్ వెదర్ లు అంచనా వేస్తున్నాయి. రెండేళ్ళ నుండి తక్కువ వర్షపాతంతో సతమతమవుతున్న దేశానికి ఈ ఏడాది ఉపశమనం కలిగించనుంది. ఈ సంస్థల అంచనాల ప్రకారం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో సరాసరి 89 సెం.మీ వర్షపాతం ఉండనుంది. ఇది సాధారణం కన్నా 5% ఎక్కువ. మంచి వర్షపాతం ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ పై సానుకూల ప్రభావం చూపనుంది.
Post a Comment