తాత్కాలిక సచివాలయం - అదనపు అంతస్తులు |
తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణం జూన్ 15కి పూర్తి అవుతుందని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ జరుగుతున్న పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల వేగం బాగుందనీ, షెడ్యూల్ కంటే ముందే పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
తాత్కాలిక సచివాలయం కోసం ఇక్కడ అయిదు భవనాలు నిర్మితమవుతున్నాయి. వీటిని జీ+1 విధానంలో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ భవనాలపై మరో రెండు అంతస్తులు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రతిపాదించిన అదనపు అంతస్తులలో జులై నెలాఖరుకు రెండో అంతస్తు, ఆగస్టు నెలాఖరుకు మూడో అంతస్తు పూర్తి అవుతుందన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న జీ+1 నిర్మాణంలో కిచెన్, వెయిటింగ్ హాల్, బ్యాంకు, పోస్టాఫీసు లకు స్థలం పోగా మిగిలిన దానిలో కేవలం 4800 మంది ఉద్యోగులు మాత్రమె పని చేయగలరనీ, మొత్తం 12 వేల ఉద్యోగులను తరలించవలసి ఉన్నందున అదనపు అంతస్తులను నిర్మిస్తున్నట్టు తెలియచేసారు.
అంటే రాష్ట్ర ప్రభుత్వం అసలెలాంటి ముందస్తు కసరత్తు లేకుండా కేవలం జీ+1 మాత్రమే నిర్మించాలని ప్రతిపాదించి, ఆ మేరకు టెండర్లు పిలిచి అప్పగించిందా?, ఎంత మంది ఉద్యోగులు విజయవాడకు వస్తున్నారో ఇవాళ గుర్తుకు వచ్చిందా?, ఇప్పుడు మిగతా రెండంతస్తులను ప్రత్యేకంగా టెండర్లు పిలవలేరు కదా? ఇలాంటి పనులు చేస్తేనే ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు వస్తాయి. ఇంకా ప్రభుత్వం జూన్ 15 నాటికే 12 వేల మంది ఉద్యోగులను తరలిస్తామని చెప్తూనే మరోపక్క ఆగష్టు నెలాఖరుకు (జీ+3) సచివాలయ నిర్మాణం పూర్తవుతుందని చెబుతోంది.

Post a Comment