రెవిన్యూ లోటు భర్తీకి ఇంకా 13 వేల కోట్లు కావాలి

 రెవిన్యూ లోటు భర్తీకి ఇంకా 13 వేల కోట్లు కావాలి
 రెవిన్యూ లోటు భర్తీకి ఇంకా 13 వేల కోట్లు కావాలి
ఏపీ రెవెన్యూ లోటును త్వరగా భర్తీ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయనున్నారు. ఇవాళ విజయవాడలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఇంకా ఇతర ఆర్ధిక శాఖ ముఖ్య అధికారులతో ఆయన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేయవలిసి ఉంది. ఆ సమయానికి రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు 16300 కోట్లు ఉండగా ఇప్పటివరకూ ఇచ్చింది కేవలం 2800 కోట్లేనని, ఈ సంవత్సరం మరో 500 కోట్లు ఇస్తున్నారని వివరించారు. రాష్ట్రానికి ఇంకా 13000 కోట్లు కేంద్రం ఇవ్వవలసి ఉందని, ఈ సంవత్సరం బడ్జెట్లో  ఇవి వస్తాయని అంచనాలు వేశామని, ఇవి రాకపోతే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

ఇప్పటికే మూడు బడ్జెట్లు వచ్చేసాయని, ఇంకా కేవలం రెండు బడ్జెట్లే మిగిలి ఉన్న ఈ  సమయంలో స్పందించకపోతే ప్రజా వ్యతిరేకత మూట గట్టుకోవలసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామిగా ఉన్న ఆయన  ఎంతవరకు ఒత్తిడి చేయగలరో చూడాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post