ఏప్రిల్ 5న ప్రారంభమవనున్న ఫాస్టెస్ట్ ట్రెయిన్

ఏప్రిల్ 5న ప్రారంభమవనున్న ఫాస్టెస్ట్ ట్రెయిన్
ఏప్రిల్ 5న ప్రారంభమవనున్న ఫాస్టెస్ట్ ట్రెయిన్
ఇండియా లోనే అత్యంత వేగవంతమైన ట్రెయిన్ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 5 నుండి తన సేవలందించనుంది.  ఢిల్లీ నుంఛి ఆగ్రాకు ప్రయాణించనున్నఈ రైలును రైల్వే శాఖామంత్రి సురేష్ ప్రభు  హజరత్ నిజాముద్దీన్‌ నుండి ప్రారంభించనున్నారు. ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కన్నా 10 కిలోమీటర్ల ఎక్కువ వేగంతో ప్రయాణించనున్న ఈ రైలు కేవలం 100 నిమిషాల లోపలే గమ్యస్థానం చేరనుంది.

అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ టోటల్ ఎయిర్ కండిషన్డ్ రైలుకి అనేక ప్రత్యెకతలున్నాయి.  ఉచిత వైఫై సౌకర్యం, ఆటోమేటిక్ అలారం సిస్టం, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సౌకర్యం, బయో టాయిలెట్స్, ఎల్‌ఈడీ లైట్స్ మరియు ప్రతి కోచ్‌కు ప్రత్యేకంగా డోర్స్ ఉన్నాయి. ఈ రైలులో మొత్తం 12 కోచ్‌లు ఉండగా, వాటిలో 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు, 8 చైర్‌కార్ లు, 2 పాంట్రీ కోచ్‌లు ఉన్నాయి. చైర్‌కార్ లో టికెట్ రేటు 690 రూపాయలు ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో 1365 రూపాయలు ఉండనుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post