పనామా లిస్టులో ముగ్గురు తెలుగు కుబేరులు

పనామా లిస్టులో ముగ్గురు తెలుగు కుబేరులు
పనామా లిస్టులో ముగ్గురు తెలుగు కుబేరులు
ప్రపంచ  వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా జాబితాలో 500 మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. ఇది పనామా, బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో కంపనీలు స్థాపించిన వారి జాబితా. ఈ లిస్టు విడుదల చేసిన మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంస్థలన్నీ నల్ల ధనాన్ని మార్పిడి చేయటానికే ఉపయోగపడ్డాయి. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం దీనిలో ముగ్గురు తెలుగు వారు కూడా ఉన్నారు. మోటూరి శ్రీనివాస్‌ ప్రసాద్‌, భావనాసి జయకుమార్‌, మరియు ఓలన్‌ భాస్కర్‌ రావు.

వీరిలో మోటూరి శ్రీనివాస్‌ ప్రసాద్‌ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త. ఇతనికి బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో నాలుగు ఆఫ్‌షోర్‌ సంస్థలు ఉన్నాయి. భావనాసి జయకుమార్‌ కూడా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త. ఇతను ఆరు కంపెనీలకు ఈయన డైరెక్టర్‌గా ఉన్నారు. ఓలన్‌ భాస్కర్‌ రావు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఇతనికి కూడా ఏడు సంస్థలలో భాగస్వామ్యం ఉంది. వీరిలో ఒకరి సంస్థలతో మరొకరికి సంబంధం ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post