పాకిస్తాన్ కు హెలికాప్టర్లను అమ్మనున్న అమెరికా

పాకిస్తాన్ కు హెలికాప్టర్లను అమ్మనున్న అమెరికా
పాకిస్తాన్ కు హెలికాప్టర్లను అమ్మనున్న అమెరికా
పాకిస్తాన్ కు F-16 విమానాలను అమ్మాలని నిర్ణయం తీసుకున్న అమెరికా, మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. సైనిక దాడులకు ఉపయోగించే AH-1Z వైపర్ హెలికాప్టర్లను పాకిస్థాన్ కు విక్రయించాలని నిర్ణయించింది. మొత్తం తొమ్మిది హెలికాప్టర్లను పాక్ కు విక్రయించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు పెంటగాన్ అధికారులు వివరించారు.

గతంలో F-16  విమానాలను అమ్మలనుకున్నప్పుడే భారత్ తమ నిరసనను అమెరికాకు తెలియజేసింది. ఈ మధ్య అమెరికా తో సంబంధాలు మెరుగుపడటం తో తరచుగా సంయుక్త నౌకాదళ విన్యాసాలు జరుపుతోంది.  ఇప్పుడు తీసుకున్న నిర్ణయం భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. భారత్ కు ఇక్కడే తయారు చేసే ప్రాతిపాదికన  F-16, F-18 విమానాలను అమ్మడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. ఈ విషయమై భారత రక్షణ శాఖకు ప్రతిపాదనలు సమర్పించినట్టు బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్  తెలియజేసాయి. కానీ ఆ దేశం మరోసారి తనకు తన వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని చెప్పినట్టయింది. ఇండియా కనీసం ఈసారైనా దృఢమైన దౌత్య విధానాన్ని అవలంభిస్తుందని ఆశిద్దాం.

0/Post a Comment/Comments

Previous Post Next Post