తెలంగాణ సమస్యలు తీరిపోయాయా?

తెలంగాణ సమస్యలు తీరిపోయాయా?
తెలంగాణ సమస్యలు తీరిపోయాయా?
ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి రెండు ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అయ్యాయని చెబుతున్నారు. నిధుల సమస్య, నియామకాల సమస్య తీరిపోయిందనీ, ఒక నీళ్ళ సమస్యను మాత్రమె తీర్చవలసి ఉందని శాసన సభలోనూ, ఉగాది సమావేశాల్లోనూ కూడా అన్నారు. ప్రస్తుతం నీళ్ళ పైనే దృష్టి పెట్టామని త్వరలోనే అది కూడా తీరనుందని కూడా వ్యాఖ్యానించారు.

చాలామంది నిజంగానే అప్పుడే నిధులు, నియామకాల సమస్య తీరిపోయిందా? నీళ్ల సమస్యే మిగిలిందా? అని ప్రశ్నిస్తున్నారు.  అయితే ముఖ్యమంత్రి ఉద్దేశ్యంలో తెలంగాణ నిధులు ఎవరితో పంచుకోవాల్సిన, పోరాడాల్సిన అవసరం లేకుండా తెలంగాణ లోనే ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది కాబట్టి నిధుల సమస్య తీరింది  అన్నరనుకోవచ్చు. అలాగే ఉద్యోగాల విషయంలో కూడా. నీళ్ళ విషయంలో మాత్రం ఇంకా పంపకాలు పూర్తి కాలేదు. ట్రిబ్యునల్ వద్ద వాదనలు వినిపించాల్సి ఉంది. ప్రాజెక్టులు కట్టవలసి ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post