ఆల్కహాల్ కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌

ఆల్కహాల్ కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌
ఆల్కహాల్ కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌
బిహార్‌లో ఇప్పుడు ఆల్కహాల్ కావాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి ప్రిస్క్రిప్షన్‌ రాయించుకునే రోజులు రానున్నాయి. మెడికల్ షాపుల్లో మందు సీసాలు అమ్మనున్నారు. ఇక్కడ మద్యపాన నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత మద్యానికి బానిసలైన వారిలో చాలా మంది శారీరకంగా, మానసికంగా అస్వస్థతకు గురౌతున్నారు. ఇలాంటివారికోసం అధికారులు రాష్ట్ర మంత్రివర్గం ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.

ఈ ప్రతిపాదనల ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ ఉన్న పేషెంట్లకు నెలకు గరిష్టంగా రెండు ఫుల్ బాటిల్ల వరకు అమ్మనున్నారు. అనారోగ్యానికి గురైన వారికి మరిన్ని డీ-అడిక్షన్ సెంటర్లు, ఉచిత వైద్యం కల్పించనున్నారు. ఎవరైనా చనిపోతే నాలుగు లక్షల రూపాయల పరిహారం కూడా అందించనున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post