కేరళ ఎన్నికల బరిలో శ్రీశాంత్

కేరళ ఎన్నికల బరిలో శ్రీశాంత్
కేరళ ఎన్నికల బరిలో శ్రీశాంత్
ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కేరళ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో దిగనున్నాడు. ఉదుమ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ  టికెట్ ను శ్రీశాంత్ కు కేటాయించారు. ఇవాళ ఇరవైమూడు మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను బీజేపీ ప్రకటించింది. మే 16 న ఈ ఎన్నికలు జరుగనున్నాయి.

ఐపిఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ నిషేధానికి గురి అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే రాజకీయాల్లో చేరిన ఇతను బీజేపీలో చేరాడు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో, ఉదుమ లేదా తిరువనంతపురం నుండి  బరిలో దింపాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. చివరికి అతనికి ఉదుమ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఖరారయింది.

0/Post a Comment/Comments