తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా లక్ష్మణ్‌

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా లక్ష్మణ్‌
తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా లక్ష్మణ్‌
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ కె.లక్ష్మణ్‌ నియమితులయ్యారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం శాసనసభాపక్ష నేతగా కూడా ఉన్నారు. ముషీరాబాద్ నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికైన లక్ష్మణ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన తనను పార్టీ గుర్తించిందన్నారు. అధిష్టానం తన పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, రాష్ట్రం లో పార్టీ ని తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తానని, 2019 ఎన్నికల్లో అధికారం లోకి వస్తామని అన్నారు.

తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు బిజెపి పార్టీ కొత్త అధ్యక్షులను నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి యదియూరప్పను, అరుణాచల్ ప్రదేశ్ కు తపిర్‌ గావ్‌ను, ఉత్తర్‌ప్రదేశ్‌కు కేవశ్‌ప్రసాద్‌ మౌర్యను మరియు పంజాబ్‌ రాష్ట్రానికి విజయ్‌ సంప్లాలను అధ్యక్షులుగా నియమించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post