నీ కంటే నీ కొడుకే పెద్ద హీరో |
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ చిన్నతనం లోనే కేన్సర్‌పై పోరాడి విజయం సాధించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆయాన్ (6) ను అభినందించారు. ఈ బాలుడు తన తండ్రి కంటే పెద్ద హీరో అని అనడం తో అందరూ హర్షం వ్యక్తం చేసారు.
తన కుమారుని జీవితం, కిడ్నీ కేన్సర్ రావటం, చికిత్సలో అనుభవించిన బాధ, ఈ సందర్భంగా తల్లిదండ్రుల మానసిక వేదన తదితర అంశాలతో హష్మీ, బిలాల్ సిద్దిఖీ రాసిన 'కిస్ ఆఫ్ లైఫ్' పుస్తకాన్ని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆవిష్కరించారు.
ఆయాన్‌కు కిడ్నీ కేన్సర్ రావడంతో అతన్ని కెనడాకి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళారు. ఏడు నెలలపాటు జరిగిన ఈ వైద్యం తన జీవితంలో అత్యంత కఠినమైన సమయమని హష్మీ పేర్కొన్నారు. ఆయాన్ వంటి చిన్నారులు పేదవాల్లయితే ప్రభుత్వాలు ఆదుకోవాలని కేజ్రీవాల్ అన్నారు. కిస్ ఆఫ్ లవ్ పుస్తకాన్ని కేన్సర్ బాధితులంతా తప్పకుండా చదవాలని కూడా పిలుపునిచ్చారు.

Post a Comment