మలేసియా ఓపెన్ సెమీస్ లో సైనా ఓటమి |
షా ఆలం లో జరుగుతున్న మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ కి చెందినా తై జు యింగ్ చేతిలో 19-21, 13-21 తేడాతో ఓటమి చవిచూసింది.
ఇది సైనాకు వరుసగా మూడో సెమీఫైనల్ ఓటమి. ఇంతకూ ముందు స్విస్ ఓపెన్, ఇండియన్ ఓపెన్ లలో కూడా సెమి ఫైనల్ లోనే పరాజయం పొందింది. ఒలంపిక్ సంస్య పతక విజేత అయిన వరల్డ్ నెంబర్ ఎయిట్ సైనా, వరల్డ్ నెంబర్ నైన్ తై జు తో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ లలో ఇది ఏడో ఓటమి. చాల ఫాస్ట్ ర్యాలీలతో సాగిన ఈ మ్యాచ్ లో ఇటీవలే మోకాలి గాయం నుండి కోలుకున్న సైనా నిలువలేకపోయింది.

ఏప్రిల్ 12వ తేదీ ని ప్రారంభమవనున్న సింగపూర్ ఓపెన్ లో సైనా పాల్గొననుంది.
Post a Comment