ప్రాజెక్ట్ రీ డిజైన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం

ప్రాజెక్ట్ రీ డిజైన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం
ప్రాజెక్ట్ రీ డిజైన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ రీ డిజైన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందని బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఒంగోలు వచ్చిన మాజీ కేంద్ర మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. 

బిజెపి పార్టీ, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి నినాదం తో ఏప్రిల్ 14 న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా జనంలోకి వెళ్లనుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంట నష్టపోతే 25% పరిహారం 15 రోజుల్లో అందేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. తన సోదరుడు బాలకృష్ణ  నటించనున్న గౌతమీపుత్ర శాతకర్ణి గురించి మాట్లాడుతూ తెలుగువారి చరిత్రను దేశ వ్యాప్తం చేసే విధంగా తీస్తున్న చారిత్రక సినిమా లో నటించనుండడం అభినందనీయమన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post