సిరియాలో కూలిన రష్యా హెలికాప్టర్

సిరియాలో కూలిన రష్యా హెలికాప్టర్
సిరియాలో కూలిన రష్యా హెలికాప్టర్
సిరియాలోని హోమ్స్ సిటీ సమీపంలో హెలికాప్టర్ కూలడంతో, ఇద్దరు రష్యా మిలిటరీ పైలట్లు మృతిచెందారు. ఆ హెలికాప్టర్‌ను ఎవరూ పేల్చలేదని, తనకు తానె కూలి పోయిందనీ రష్యా రక్షణ వర్గాలు తెలియజేసాయి. 

కూలిన హెలికాప్టర్‌ను ఎంఐ28హెచ్‌గా గుర్తించారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు ఝామున జరిగిందని, పైలట్ల మృతదేహాలను అక్కడినుండి హెయిమ్మిమ్ ఎయిర్ బేస్ కు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు. 

సిరియా అధ్యక్షుడు బాషర్ అల్-అస్సద్ విజ్ఞప్తి మేరకు గత సెప్టెంబర్ నుండి రష్యా వైమానిక దాడులు మొదలు పెట్టింది. ఇక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం లో గత ఐదు సంవత్సరాలలో 2,50,000 మంది చనిపోగా కొన్ని మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post