హైక్ మెసెంజర్ లో గేమ్స్ |
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ ఆప్ హైక్ మెసెంజర్ తన యూజర్లకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతానికి కొత్త వెర్షన్ లో గేమ్స్ ఫీచర్ ని జత చేసింది. ఇంతకు ముందే బీటా (టెస్టింగ్) వెర్షన్ లో గేమ్స్ అందుబాటులోకి తెచ్చినా, ఇప్పుడు పూర్తి స్థాయి ప్రోడక్ట్ విడుదల చేసారు.
ఈ ఫీచర్‌ని విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు అప్‌డేటెడ్ వెర్షన్‌ను డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా వినియోగించుకోవచ్చు. ఇప్పటికైతే చెస్, స్నేక్, సాలిటెయిర్, సుడోకు, వర్డ్ రష్ వంటి బేసిక్ గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని గేమ్స్‌ను అందించనున్నామని వారు తెలియజేశారు.
సోషల్ మీడియా ఆప్స్ వినియోగించే యూజర్ల సంఖ్య పెరిగిపోతుండడంతో, ఆయా సంస్థలు వీరిని ఆకట్టుకునేందుకు తాము అందించే సేవలకు కొత్త ఫీచర్లను జత చేస్తున్నాయి. హైక్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం యూజర్లు ఒక వైపు మెసెంజర్ వినియోగిస్తూనే, మరో వైపు గేమ్స్ ఆడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రతి రోజు దాదాపు 20 నిమిషాల పాటు గేమ్స్ ఆడుతున్నట్లు సర్వేలు తెలియచేస్తున్నాయని, అందుకే ఈ ఫీచర్ ని జత చేసామని వివరించారు.
Post a Comment