బీహార్ లో మద్యనిషేధం

బీహార్ లో మద్యనిషేధం
బీహార్ లో మద్యనిషేధం
బీహార్ మద్యనిషేధానికి సన్నద్ధమవుతోంది. ఈ మద్యనిషేధాన్ని రెండు దశల్లో అమలు చేయనున్నారు. ఇవాల్టి (ఏప్రిల్ 1) నుండి ప్రారంభమవుతున్న మొదటి దశ లో, గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా తయారయ్యే మద్యం పై నిషేధం అమలవనుంది. పాట్నా, గయ లాంటి పట్టణాలలో అదికూడా కేవలం ప్రభుత్వ దుకాణాలలో మాత్రమే మద్యం లభించనుంది. మరో ఆరు నెలల తర్వాత అంటే అక్టోబర్ 1 నుండి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలవనుంది.

గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి నితిష్ కుమార్ బిహార్ ను మద్య రహిత రాష్ట్రంగా మారుస్తానని, ఏప్రిల్ 1నుంచి దశల వారీగా అమలు చేస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా బిహార్ మద్యం పాలసీ సవరణ చట్టం 2016 ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం మద్యాన్ని ఇంట్లో తాయారు చేసినా, అమ్మినా కఠిన శిక్షలున్నాయి. కల్తీ మద్యం వల్ల చనిపోతే మరణ శిక్ష విధించవచ్చు. బహిరంగంగా మద్యం తాగిన వారికి అయిదు నుండి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్షను ప్రతిపాదించారు. వీటి విషయం లో ప్రజలు ఫిర్యాదు చేసేందుకు జీమెయిల్ ఐడి, టోల్ ఫ్రీ నెంబర్,  ఫ్యాక్స్ లను కూడా ఏర్పాటు చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post