విలేఖర్ల కోసమే హెల్మెట్ తీసాడంట

విలేఖర్ల కోసమే హెల్మెట్ తీసాడంట
విలేఖర్ల కోసమే హెల్మెట్ తీసాడంట
హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీల సందర్భంగా మేయర్  బొంతు రామ్మోహన్ బుధవారం రాత్రి హెల్మెట్ లేకుండా వాహనం నడిపారంటూ కొన్ని మీడియాలతో పాటు సోషల్‌మీడియాలోనూ వార్తలు రావటం తో ట్రాఫిక్ పోలీసులు  హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు మేయర్‌కు ఈ - చలాన్ ద్వారా 100 రూపాయల  జరిమానా విధించారు.

అయితే నిన్న సాయంత్రం మేయర్ కార్యాలయ అధికారులు, పోలీసులను కలిసి మేయర్  హెల్మెట్ పెట్టుకునే వాహనం నడిపారనీ, కేవలం విలేఖరులు  ఫొటో తీసుకోవటం కోసమే కాసేపు హెల్మెట్ తీసారనీ, వివరణ ఇవ్వటం తో పాటు అందుకు సంబంధించిన ఫొటోలను ట్రాఫిక్ పోలీసులకు అందించటం తో, వారు ఈ-చలాన్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post