మిస్‌ ఇండియాగా ప్రియదర్శిని ఛటర్జీ

మిస్‌ ఇండియాగా ప్రియదర్శిని ఛటర్జీ
మిస్‌ ఇండియాగా ప్రియదర్శిని ఛటర్జీ
ఎఫ్‌బిబి ఫెమినా మిస్‌ ఇండియా ఫైనల్స్ శనివారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగాయి. ఫైనల్‌కి చేరుకున్న 21 మంది అభ్యర్థుల్లో దిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్‌ ఇండియా వరల్డ్‌- 2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరితమైన వాతావరణంలో బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌ విజేత పేరును ప్రకటించారు. ఈమె మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా ప్రతినిధిగా వెళ్లనున్నారు. 

ఈ పోటీల్లో బెంగళూరుకి చెందిన సుశ్రుతి కృష్ణ మొదటి రన్నరప్‌గా నిలవగా, లక్నోకి చెందిన పంఖుడి గిడ్వాని రెండో రన్నరప్‌గా నిలిచింది. కరణ్‌ జోహార్‌, మనీశ్‌ పాల్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సంజయ్‌దత్‌, యామీ గౌతమ్‌, అర్జున్‌కపూర్‌, కబీర్‌ ఖాన్‌, అమీ జాక్సన్‌, మిరాయా లలాగున, సానియామీర్జా, ఏక్తాకపూర్‌, మనీశ్‌ మల్హోత్ర, షేన్‌ పీకాక్‌లు వ్యవహరించారు.ప్రముఖ డిజైనర్లు అంజు మోదీ, నమత్ర జోషిపుర, ఫాల్గుణి, షేన్‌ పీకాక్‌లు ఈ పోటీల్లో పాల్గొన్న వారి దుస్తులను డిజైన్ చేసారు.

0/Post a Comment/Comments