జేడీయూ కొత్త అధ్యక్షుడిగా నితీశ్‌

జేడీయూ కొత్త అధ్యక్షుడిగా నితీశ్‌
జేడీయూ కొత్త అధ్యక్షుడిగా నితీశ్‌
ఊహించిన విధంగానే జనతాదళ్ (యు)  కొత్త అధ్యక్షుడిగా బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. వరసగా మూడుసార్లు పదవిని చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ పదవీ కాలం నేటితో ముగియనుంది. శరద్‌ యాదవ్‌ నాలుగోసారి పదవిలో కొనసాగాలంటే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది. దానికి ఆయన నిరాకరించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నేడు (ఆదివారం)  సమావేశమైన పార్టీ జాతీయ మండలి నితీశ్‌కుమార్‌ ని తమ అద్యక్షుడిగా ఎన్నుకుంది.

2003 లో సమతా పార్టీ, జనతాదళ్ నుండి విడిపోయిన శరద్ యాదవ్ నేతృత్వం లోని పార్టీలు కలిసి జనతాదళ్ (యు) గా ఏర్పడ్డాయి. పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడిగా జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్నుకోబడ్డారు. తర్వాత 2006 లో నితీశ్ కు సన్నిహితుడైన శరద్‌యాదవ్‌ జేడీయు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి వరుసగా మూడు సార్లు శరద్‌ యాదవ్‌ అధ్యక్షుడిగా కొనసాగారు.

0/Post a Comment/Comments