ఐపీఎల్‌ 9 నుండి హర్షా భోగ్లే ఔట్

ఐపీఎల్‌ 9 నుండి హర్షా భోగ్లే ఔట్
ఐపీఎల్‌ 9 నుండి హర్షా భోగ్లే ఔట్
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లేను బీసీసీఐ తమ ప్యానెల్ నుండి తొలగించింది. అతనితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో హర్షా భోగ్లే ప్రవర్తన, వ్యాఖ్యానంపై క్రికెటర్ల నుండి విమర్శలు రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ ల మ్యాచ్‌లో విజయానికి చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో వ్యాఖ్యాతగా ఉన్న హర్షా భోగ్లే  బంగ్లాదేశ్ కు అనుకూలంగా మాట్లాడటం పైన పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అమితాబ్ బచ్చన్ కూడా హర్షా భోగ్లే కు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ట్వీట్ కూడా చేసాడు. అంతేకాక భారత్, న్యూజీలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విఐపి లాంజ్ లో ఎక్కువసార్లు అటూ ఇటూ తిరగొద్దన్న విదర్భ క్రికెట్ అధికారులతో గొడవ పెట్టుకున్నాడట. ఐపీఎల్‌ ఆరంభం నుండి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హర్షా భోగ్లే తొలిసారి ఈ టోర్నీకి దూరమవనున్నాడు.

0/Post a Comment/Comments

Previous Post Next Post