కర్బన ఉద్గారాలు లేని దేశం

కర్బన ఉద్గారాలు లేని దేశం
కర్బన ఉద్గారాలు లేని దేశం
కొన్నాళ్ళ క్రితం బ్రిటన్ విద్యుత్ శాఖా మంత్రి ఆండ్రియా లీడ్సామ్, దేశాన్ని ప్రపంచం లో మొదటి కర్బన ఉద్గారాలు లేని దేశంగా చేస్తామని ప్రకటించారు. అదెలా సాధ్యమవుతుంది. మనుషులు వదిలే గాలి కూడా కర్బన ఉద్గారమే కదా అని అడిగితే జవాబు చెప్పలేక పోయింది.  ఇప్పుడు ఇది సాధ్యమేనని ప్రభుత్వం చేసి చూపిస్తోంది. ఎలాగంటే తయారీ పరిశ్రమలు వరుసగా మూతపడుతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. త్వరలో మనుషులు బతకలేని దేశంగా చేసేస్తారు. ఇది యూకే లో ఈ మధ్య బాగా ప్రచారం లో ఉన్న జోక్.

దేశం లో తయారీ పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మూట పడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు కూడా లేకుండా పోతున్నాయి. ఇప్పటికే దేశంలో అల్యూమినియం, రసాయనాలు, బొగ్గు ఆధారిత పరిశ్రమలు మూతపడగా ఇప్పుడు స్టీల్ పరిశ్రమ వంతు వచ్చింది. టాటా స్టీల్ యూకేలో 15000 ఉద్యోగాలు కల్పిస్తోంది కానీ త్వరలో కార్యకలాపాలు నిలిపివేయనుంది. దీనికి కఠినమైన పర్యావరణ నిబంధనలు, ప్రపంచం లోనే అత్యధిక విద్యుత్ చార్జీలు (పక్కనే ఉన్న జర్మనీ, ఫ్రాన్స్ లతో పోలిస్తే 50% ఎక్కువ ) కారణంగా చెప్తున్నారు. దీనితో అక్కడి ప్రభుత్వం పై, పర్యావరణ నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

0/Post a Comment/Comments