జమ్మూకశ్మీర్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా

జమ్మూకశ్మీర్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా
జమ్మూకశ్మీర్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా
పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (PDP) అధినేత  మెహబూబా ముఫ్తీ ఏప్రిల్‌ 4న జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని గవర్నర్‌ ఎన్‌.ఎన్‌ వోహ్రాకు తెలియజేసినట్లు బీజేపీ, పీడీపీ పార్టీలు ప్రకటించాయి. ఉపముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

జనవరి 7వ తేదీన జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణించారు. అప్పటి నుండి ఇక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. మెహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు. ఆవిడ అయిష్టత తో బీజేపీ - పీడీపీ పార్టీల మద్య పొత్తుపై సందిగ్ధత నెలకొంది.  అయితే ఇరు పార్టీలు సుదీర్ఘ చర్చల తర్వాత రాజీ కుదుర్చుకున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post