నీతా అంబానీ - శక్తిమంతమైన మహిళ

నీతా అంబానీ - శక్తిమంతమైన మహిళ
నీతా అంబానీ - శక్తిమంతమైన మహిళ
ఫోర్బ్స్ ఆసియాలోని అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో రిలయన్స్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా అంబానీ మొదటిస్థానంలో నిలిచారు. 50 మందితో కూడిన 2016 ఆసియా మోస్ట్‌ పవర్‌ఫుల్‌ మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. దీనిలో ఎనిమిది మంది భారతీయులున్నారు.  ఎస్‌బీఐ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుంధతీ భట్టాచార్యఈ జాబితాలో  రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 

మ్యూ సిగ్మా సీఈఓ అంబిగా ధీరజ్‌ (14వ స్థానం), వెల్‌స్పన్‌ ఇండియా సీఈఓ వినీతా గుప్తా (18వ స్థానం), ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ చందా కొచ్చర్‌ (22వ స్థానం), వీఎల్‌సీసీ హెల్త్‌ కేర్‌ ఫౌండర్‌ అండ్‌ వైస్‌ ఛైర్మన్‌ వందనా లుత్రా (26వ స్థానం), బయోకాన్‌ ఫౌండర్‌, ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మజుందార్‌ షా (28వ స్థానం) లు ఈ జాబితాలో ఉన్నారు. కాగా ఆసియా లో ఇంకా లింగవివక్ష కొనసాగుతుందని, అయినా ఈ మహిళలు వ్యాపార రంగంలో రాణించవచ్చనే సందేశాన్ని అందిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post