మద్యం దొరక్క సబ్బు తింటున్నాడు

మద్యం దొరక్క సబ్బు తింటున్నాడు
మద్యం దొరక్క సబ్బు తింటున్నాడు
బీహార్లో మద్య నిషేధం అమలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో , ఉన్నపళంగా మానేసిన మందుబాబులకు పిచ్చెక్కిపోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇలాంటి విత్ డ్రాయల్ సింప్టమ్స్ ని ముందుగానే ఊహించిన రాష్ట్రప్రభుత్వం 38 డీ అడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటుచేసింది.150 మంది డాక్టర్లకు, 45 మంది కౌన్సిలర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇందులో నియమించింది.

ఇప్పటికే 750 మంది ఈ డీ అడిక్షన్‌ సెంటర్లకు వచ్చారని డాక్టర్లు తెలియ చేసారు. వీరిలో కొందరు వణుకుతూ, కనీసం నిలబడలేకపోతున్నారని, మరి కొందరైతే తమ కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేకపోతున్నారని తెలిపారు.  కొంత మంది గొడవలు కూడా పెట్టుకుంటున్నారని, చేతికి ఏది దొరికితే అది తినేస్తున్నారని కూడా వివరించారు. ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో మద్యం సేవించే వారిలోనే ముఖ్యంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు తెలిపారు. సామాన్యంగా ఇలాంటి విత్ డ్రాయల్ సింప్టమ్స్ 2 నుండి 3 వారాల్లో  తగ్గుముఖం పడుతాయని, రానున్న రోజుల్లో ఇంకా  ఎక్కువ మంది డీ అడిక్షన్‌ సెంటర్లకు రావచ్చని, 2 నెలల్లో మొత్తం సర్దుకుంటాయని వారు వివరించారు.

బెట్టాయ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, ఆల్కహాల్ దొరక్క పోవడంతో మత్తుకోసం సబ్బులను తినేస్తున్న వీడియో స్థానిక మీడియా ఛానళ్లలో , సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారమవుతుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post