తెలంగాణాలో వడదెబ్బకు 66 మంది మృతి

తెలంగాణాలో వడదెబ్బకు 66 మంది మృతి
తెలంగాణాలో వడదెబ్బకు 66 మంది మృతి
వేసవి ఇంకా ప్రారంభదశలోనే ఉంది. కానీ ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో  వడదెబ్బ కారణంగా తెలంగాణాలో 66 మంది మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ లో 28 మంది, మెదక్ లో 11 మంది, నిజామాబాదు లో ఏడుగురు, ఖమ్మం, కరీంనగర్ లలో ఐదుగురు, ఆదిలాబాద్, వరంగల్ లలో నలుగురు మరియు నల్గొండ లో ఇద్దరు మృతి చెందారు.

నల్గొండలో అయితే గత 24 గంటలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం కలవరపెడుతుంది. హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మే నెలలో 45 డిగ్రీలు దాటవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర హైకోర్ట్ ఇప్పటికే పగటిపూట పని నిషేధించాలని ఆదేశాలు జారీచేసింది.

0/Post a Comment/Comments