ఎన్‌ఐఏ అధికారి కాల్చివేత

ఎన్‌ఐఏ అధికారి కాల్చివేత
ఎన్‌ఐఏ అధికారి కాల్చివేత
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్‌లో జాతీయ దర్యాప్తు సంస్ధ (NIA) అధికారి మహమ్మద్ తంజీమ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. ఎన్ఐఏలో డీఎస్పీ గా పనిచేస్తున్న తంజీమ్ కుటుంబ సభ్యులతో ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా, బిజ్నూరు సమీపంలో గుర్తు తెలియని దుండగులు కుటుంబ సభ్యుల కళ్ళ ముందే కాల్చి చంపారు. ఈ ఘటనలో తంజీమ్ అక్కడికక్కడే చనిపోగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నోయిడా ఆస్పత్రికి తరలించారు.

మహమ్మద్ తంజీమ్, పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడిచేసిన కేసును దర్యాప్తు చేస్తుండటంతో ఈ సంఘటన సంచలనం కలిగిస్తోంది. ఉగ్రవాదుల పాత్ర పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post