టెట్రాప్యాక్ లలో చీప్ లిక్కర్ |
అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీప్ లిక్కర్ అమ్మకాలు చేపట్టనుంది. నవోదయం పేరు తో వ్యవహరించే వీటిని 180 ml, 90 ml పరిమాణం లో ఉండే టెట్రాప్యాక్ లలో ప్యాక్ చేసి అమ్మకానికి పెట్టనున్నారు. 180 ml ప్యాక్ ధర 45 రూపాయలుగా నిర్ణయించారు. దీనితో సంవత్సరానికి వెయ్యి కోట్ల అదనపు ఆదాయం సంపాదించవచ్చని భావిస్తున్నారు.
ఈ చీప్ లిక్కర్ తో కల్తీ మద్యాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. బాగ్ పైపర్, ఒరిజినల్ చాయిస్ తదితర కంపెనీలను తమ ఉత్పత్తులలో 20% చీప్ లిక్కర్ తయారు చేయాలని సూచిస్తూ ఆమేరకు వారికి పర్మిషన్ ఇచ్చేసింది. తెలంగాణా ప్రభుత్వం చీప్ లిక్కర్ ను ప్రవేశ పెట్టాలని భావిస్తే, అక్కడ తెలుగు దేశం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు సాగించే దురుద్దేశం తోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. బీహార్లో మద్యనిషేధం దిశగా అడుగులు పడుతున్న ఈ సమయంలో రాష్ట్రం లో అమ్మకాలు పెంచే దిశగా నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమే.

Post a Comment