మయన్మార్ మాజీ అధ్యక్షుడి సన్యాసం

మయన్మార్ మాజీ అధ్యక్షుడి సన్యాసం
మయన్మార్ మాజీ అధ్యక్షుడి సన్యాసం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధికారం లోకి వచ్చింది. ఇది జరిగిన నాలుగు రోజులకే మిలిటరీ పాలకుడు తియాన్‌సెన్‌ కి జ్ఞానోదయం అయినట్టుంది. సోమవారం రోజు తియాన్‌సెన్‌ బౌద్ధ సన్యాసిగా మారారు. అయన సన్యాసి గా మారుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో ప్రచారమవుతున్నాయి. వాటిలో అయన గుండు చేయించుకొని ఎర్రని వస్త్రాలను ధరించారు.

తియాన్‌సెన్‌ నుండి  ఇంతవరకు ఎలాంటి అధికార ప్రకటన విడుదల కాలేదు. మయన్మార్ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆయన తాత్కాలిక ప్రాతిపదికన సన్యాసం తీసుకున్నారు. కేవలం ఐదు రోజులపాటు సన్యాసిగా దిప్తి ఆశ్రమంలో గడుపుతారు.

జనవరిలో బౌద్ధుల సమ్మేళనానికి హాజరైన సందర్భంగా,  ఆయన తన సన్యాస నిర్ణయాన్ని తీసుకున్నారట. మయన్మార్‌లో ప్రజల్లో చాలామంది ఏదో ఒక సమయంలో ఇలా కొద్ది రోజుల పాటు సన్యాసం తీసుకొని బౌద్ధ సన్యాసులతో గడుపుతారట.

0/Post a Comment/Comments

Previous Post Next Post