విద్యుత్ కోసమే ఏటా తొమ్మిదివేల కోట్లు

విద్యుత్ కోసమే ఏటా తొమ్మిదివేల కోట్లు
విద్యుత్ కోసమే ఏటా తొమ్మిదివేల కోట్లు
సాగునీటి ప్రాజెక్టులపై  ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసన సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, కెసిఆర్ ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు నిర్మించేవన్నీ లిఫ్ట్-ఇరిగేషన్ (ఎత్తిపోతల)  పథకాలే కదా. తర్వాత వీటి నిర్వహణకు ఎంత విద్యుత్ ఖర్చవుతుంది? అంత విద్యుత్ అందుబాటులో ఉందా? వాటి చార్జీలను ఎవరు భరిస్తారు? అంత శక్తి ప్రజలకు ఉంటుందా?  అని అడిగారు.

దీనికి కెసిఆర్ సమాధానమిస్తూ ఈ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కోసం సంవత్సరానికి ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల కోట్లు అవసరమవుతాయని బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని భరించగలదని, పంటలు బాగా పండుతాయి కాబట్టి అవసరమైతే ప్రజలు కొంతభాగం వరకు ఇవ్వగలరని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే రైతులకు ఉచిత విద్యుత్ కింద నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామనీ, ఒకసారి ప్రాజెక్టులు అయిపోతే ఇది తగ్గుతుందని భావిస్తున్నామని తెలిపారు.

రానున్న కొన్నేళ్లలో సుమారు 24000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తామని, సరిపోకపోతే అప్పటి వరకు కేంద్ర గ్రిడ్ తో దక్షిణాది గ్రిడ్ అనుసంధానం పూర్తి అవుతుంది కాబట్టి కొరత ఉండబోదని చెప్పుకొచ్చారు.
Labels:

Post a Comment

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget