కరణ్‌, బిపాషా వెడ్డింగ్ ఇన్విటేషన్

కరణ్‌, బిపాషా వెడ్డింగ్ ఇన్విటేషన్
కరణ్‌, బిపాషా వెడ్డింగ్ ఇన్విటేషన్
బాలీవుడ్‌ ప్రేమికులు  బిపాషా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 30వ తేదీన వీరి వివాహం ముంబై లోని లోయర్ పరేల్ లోని పల్లాజియో లో జరుగనుంది. పెళ్లి సాయంత్రం 6.30 గంటలకు, రిసెప్షన్‌ రాత్రి 10 గంటలకు జరుగనున్నాయి. అయితే దీని గురించి వారు ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.

వీటికి కరణ్‌,  బిపాషాలు కేవలం తమ సన్నిహితులు కొంతమందికి ఆహ్వాన పత్రికలు పంపారు. వారిలో ఒకరు దీనిని సోషల్ మీడియా లో షేర్ చేయడంతో వైరల్ గా మారి అందరికీ తెలిసిపోయింది.

0/Post a Comment/Comments