విద్యుత్ ఉద్యోగులకు ఊరట |
ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగి తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 1253 మంది విద్యుత్ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సంయుక్తంగా 58:42 నిష్పత్తిలో జీతాలు ఇవ్వాలని గతంలో హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం సవరించింది. వారు తెలంగాణలో పనిచేస్తున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
గతంలో ఈ 1253 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణా ప్రభుత్వం విధులనుండి తొలగించింది. వారు హైకోర్ట్ ను ఆశ్రయించగా తాత్కాలికంగా వారిని మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ, జీతాల్ని మాత్రం 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సూచించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణాలో పనిచేసేవారికి తాము జీతాలెందుకివ్వాలని కోర్టుకెక్కింది. ఉద్యోగులు కూడా తమకు ఏదో ఒక ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని ఆదేశించాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Post a Comment