164000 వాహనాలను రీకాల్‌ చేసిన హోండా

164000 వాహనాలను రీకాల్‌ చేసిన హోండా
164000 వాహనాలను రీకాల్‌ చేసిన హోండా
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా 164000 వాహనాలను రీకాల్‌ చేసింది. జపాన్‌లోని ఫిట్‌ సబ్‌కాంపాక్ట్‌ (Fit subcompact), వెజెల్‌ స్పోర్ట్‌ యుటిలిటీ (Vezel sport-utility) వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు సోమవారంనాడు ఒక ప్రకటన లో తెలిపింది. వీటిలో పవర్‌ స్టీరింగ్‌ సమస్యలు, ఎలక్ట్రిక్‌ సర్క్యూట్ లలో లోపాలను కారణాలుగా తెలిపింది. 

ఈ వాహనాలు 2013 ఆగస్టు నుండి  ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తయారు చేసారు. ఈ వాహనాలలో సమస్యలు ఉన్నప్పటికీ వాటి వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఫిట్‌ సబ్‌కాంపాక్ట్‌ స్టీరింగ్‌ లోపం కారణంగా రెండు చిన్న చిన్న ఆక్సిడెంట్లు జరిగాయని వెల్లడించారు.  వెజెల్‌ కారులో  స్టీరింగ్‌ సమస్య లేదని, ఎలక్ట్రిక్‌ సర్క్యూట్  లో చిన్న లోపం మాత్రమె ఉందని, దీని వలన ఇప్పటివరకు 6 అగ్ని ప్రమాదాలు జరిగాయని, ఎవరూ గాయపడలేదని తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post