టిఆర్ఎస్ ఇన్సూరెన్స్ రెన్యువల్

టిఆర్ఎస్ ఇన్సూరెన్స్ రెన్యువల్
టిఆర్ఎస్ ఇన్సూరెన్స్ రెన్యువల్
తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ తన పార్టీ కార్యకర్తలకు ఉన్న ప్రమాద బీమాపథకాన్ని మరో ఏడాది పాటు రెన్యువల్ చేసింది. దీనికి సంబంధించిన ప్రీమియం మొత్తం 5,43,87,500ల రూపాయలను ఎంపీ కవిత ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అందచేసారు. ఈ మొత్తంతో 50 లక్షల మంది కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల  ప్రమాద బీమా వర్తించనుంది. గత సంవత్సరం 4.73 కోట్ల ప్రీమియం చెల్లించగా 10 కోట్ల రూపాయల క్లెయిములు ఉండటం విశేషం. 

గత సంవత్సరం నుండి రాష్ట్రం లో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించటం మొదలుపెట్టాయి. తెలుగు దేశం పార్టీ ఈ భీమాను ప్రారంభించగా టిఆర్ఎస్ పార్టీ కూడా అనుసరించింది

0/Post a Comment/Comments

Previous Post Next Post