ఐఎస్‌కు మరో ఎదురుదెబ్బ

ఐఎస్‌కు మరో ఎదురుదెబ్బ
ఐఎస్‌కు మరో ఎదురుదెబ్బ
ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌) ఉగ్రవాదుల నుండి పాల్మైరాను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ దళాలు, అల్-ఖర్యతైన్ నగరాన్ని కూడా తిరిగి ఆధీనంలోకి తెఛుకున్నయి. ఇది ఐఎస్‌ సంస్థ కు పెద్ద  ఎదురుదెబ్బ గా భావిస్తున్నారు. దీనితో ఉగ్రవాద సంస్థ కు జరిగే సరకు రవాణా అడ్డుకుంటామని సిరియన్ ఆర్మీ అధికారులు తెలియజేశారు.

పాల్మైరాకు 80 కిలోమీటర్ల దూరంలో అల్-ఖర్యతైన్ ఉంటుంది. గత ఆగస్టులో ఈ నగరాన్ని ఐఎస్‌ తమ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడి వందలాది మంది ప్రజలను, ముఖ్యంగా క్రిస్టియన్లను బందీలుగా చేసుకుంది. రష్యా దళాల సహాయం మొదలైన తర్వాత సిరియా ప్రభుత్వ దళాలు గణనీయమైన పురోగతి సాధిస్తున్న విషయం తెలిసిందే.

0/Post a Comment/Comments