ఈనాడు వెబ్ సైట్ మేకోవర్

ఈనాడు వెబ్ సైట్ మేకోవర్
ఈనాడు వెబ్ సైట్ మేకోవర్
తెలుగులో అన్ని న్యూస్ పేపర్స్ కి వెబ్ సైట్స్ ఉన్నా ఏవీ అంత బాగా ఉండవు. వీటిలో సాక్షి, నమస్తే తెలంగాణ కొంచం బెటర్. ఏవి, ఎక్కడ ఉన్నాయో అర్థం అయ్యేలా ఉంటాయి. ఈనాడు విషయానికి వస్తే, ఎన్నో సంవత్సరాల నుండి అదే పాత స్టైల్ వెబ్ సైట్ చూడాలంటేనే కష్టంగా అనిపించేది. ఏవి ఎక్కడ ఉంటాయో అలవాటయిపోయి చూడగలిగాం.

హమ్మయ్య, మొత్తానికి ఇవాళ ఈనాడు వెబ్ సైట్ ని అప్ డేట్ చేసారు. దానిలో చూడగానే కనిపించే విషయాలు కొన్ని
  • హెడర్ లో చండాలంగా కనిపించే ఆడ్స్ ని చాల వరకు తీసేసారు. ఇప్పుడు కొంచం NDTV లాగా అనిపిస్తున్నా బాగుంది. అదే వెబ్సైటు స్టైల్ లో కిందవరకు కేటగిరీలు బాక్సుల రూపంలో పెట్టారు.
  • వెబ్ సైట్ కు రెస్పాన్సివ్ డిజైన్ ఇవ్వటంతో, ఏ రిజల్యూషన్ స్క్రీన్ వాడేవారికైనా ( i.e. ట్యాబులు, మొబైల్ లు లాంటివి వాడేవారికి కూడా) ఇదే వెబ్సైటు ఆటోమాటిక్ గా అడ్జస్ట్ అయి కనిపించనుంది.
  • ప్రింట్లో చాలా అందంగా వుండే ఈనాడు ఫాంట్ ఎందుకో వెబ్ లో అంత బాగా అనిపించదు. మొత్తానికి భేషజాన్ని వదిలించుకుని ఆ ఫాంట్ ని తీసేశారు.
ఇన్ని మార్చినా ఇంకా url స్టైల్ పాతగానే ఉంది. త్వరలో అదికూడా మారుతుందేమో, ఈనాడు అలవాటు అయిపోయిన కొంత మంది పెద్ద వయసు వాళ్లకు ఈ మార్పులు అంతగా నచ్చక పోవచ్చు. కానీ కొన్నాళ్ళలోనే అలవాటు పడతారు. ఏది ఏమైనా నాకు మాత్రం ఈ మార్పు నచ్చింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post