సీఎంఆర్ఎఫ్ స్కాం లో 10 మంది అరెస్ట్

 సీఎంఆర్ఎఫ్ స్కాం లో 10 మంది అరెస్ట్
 సీఎంఆర్ఎఫ్ స్కాం లో 10 మంది అరెస్ట్
తెలంగాణ‌లో సీఎం సహాయక నిధులు (CMRF) పక్కదారి పట్టాయి. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ ఈ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించింది. 50 ఆస్స‌త్రులలో, 112 మంది చికిత్స పొందినట్లు న‌కిలీ వైద్య బిల్లులు సృష్టించి 73,68,572 రూపాయలు స్వాహా చేసారు. దీనిలో ఇప్పటి వరకు 20 మంది దళారులను గుర్తించారు. ఇంకా ఇంకా విచారణ కొనసాగుతుందని, ఈ సంఖ్యలు మరింత పెరగవచ్చని సీఐడీ అధికారులు తెలిపారు.  వీరిలో ఇప్పటివరకూ 10 మంది నిందితుల‌ను, 5గురు దళారులను అరెస్ట్ చేసామని వివరించారు. 

నిరుపేదల అత్యవసర వైద్య సేవల కోసం ఉపయోగ పడాల్సిన ఈ నిధి పక్క దారి పట్టడం పై ముఖ్యమంత్రి గత సంవత్సరం సీఐడీ విచారణ కు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ దీనివల్ల నిజమైన బాధితులకు కొంత నష్టం జరిగిందని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post