ఓరీస్ హోటల్‌ సీజ్

ఓరీస్ హోటల్‌ సీజ్
ఓరీస్ హోటల్‌ సీజ్
అపరిశుభ్రత కారణంగా నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో ఉన్న ఓరీస్ హోటల్‌ను గ్రేటర్ అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్‌ను మంగళవారం నగర పాలక సంస్థ అధికారులు పరిశీలించిన సమయంలో కిచెన్ మురుగు డ్రైనేజీ నీటితో నిండి ఉన్నట్టు తెలిపారు. అయినా అలాగే రెస్టారెంట్‌ను నిర్వహించడంపై జీహెచ్ఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత పేరున్న హోటల్ ఇంత అపరిశుభ్రంగా ఉండటం పై స్థానికంగా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. షరా మామూలుగానే అధికారులు తమకు సిబ్బంది కొరత ఉందనీ,  ఇకపై రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తామని చెబుతున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post