డబ్బింగ్ సినిమాలకు 'బాలు' మద్ధతు

డబ్బింగ్ సినిమాలకు 'బాలు' మద్ధతు
డబ్బింగ్ సినిమాలకు 'బాలు' మద్ధతు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ సినిమాలకు తన మద్ధతు ప్రకటించారు. పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల్ని నిషేధించాలనే వాదన కొందరు పెద్దలు వాదిస్తుంటారు. మనకు చేతనైతే అంతకన్నా మంచి సినిమాలు తీయాలి కానీ, బాగున్న సినిమాల్ని ఎందుకు నిషేధించాలి?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

హైదరాబాద్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు’ పేరిట డాక్టర్ పైడిపాల రచించిన పరిశోధనా గ్రంథాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. డబ్బింగ్ చాలా క్లిష్టమైన, గొప్ప  ప్రక్రియ అని,  శివాజీ గణేశన్ లాంటి మహానటులు తెలుగులో దశరథరామయ్య, కె.వి.ఎస్. శర్మ, జగ్గయ్య లాంటి వారి గొంతు ద్వారానే తెలుగువారికి తెలిశారని అన్నారు. తాను గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ కళాకారుడిగా కూడా పనిచేశానని తెలిపారు.

ఫిల్మ్ మీద ఒక భాషలో ఉన్న సౌండ్ ట్రాక్‌ను తొలగించి, వేరే భాష డైలాగ్ పెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ, వాళ్ళకు జోహార్ అన్నారు. పరభాషా చిత్రాల్ని మన తెలుగు నుడికారంలోకి తెచ్చే రచయితలే ఆ డబ్బింగ్ చిత్రాల విజయానికి ప్రధానకారకులు. తెలుగులోకి సినిమాను డబ్బింగ్ చేసే ప్రక్రియకు ఆద్యుడైన రచయిత శ్రీశ్రీ నుంచి అనిసెట్టి, రాజశ్రీ, నేటి వెన్నెలకంటి, రామకృష్ణ దాకా ఈ శాఖను ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులందరికీ వందనాలు. అని బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.

రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ, తెలుగులో తొలిసారి డబ్బింగ్ పాటలపై ఇంత ప్రామాణిక రచన రావటం పై సంతోషం వ్యక్తం చేస్తూ, రచయిత పైడిపాలను అభినందించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post