కేంద్రమంత్రి సుజనాచౌదరికి అరెస్ట్ వారెంట్ |
కేంద్ర మంత్రి సుజనా చౌదరికి బుధవారం నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మారిషస్ బ్యాంకుకు ఋణ ఎగవేత కేసులో ఆయన కోర్టుకు హాజరు కాకుండా న్యాయవాది సహాయంతో మినహాయింపు కోరారు. ఆయన వరుసగా మూడు సార్లు కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. కేసు విచారణ ను ఏప్రిల్ ఇరవైఆరుకు వాయిదా వేశారు. సుజనా సంస్థల అధినేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి 106 కోట్ల రూపాయలు బకాయిపడడంతో మారిషస్ బ్యాంక్ నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు సుజనా కోర్టుకు రాక తప్పని పరిస్థితి వచ్చింది.
Post a Comment