అమ్మ పవర్

అమ్మ పవర్
అమ్మ పవర్
తమిళ రాజకీయాల్లో ముఖ్యంగా AIADMK పార్టీలో జయలలిత మాటకు ఎదురు లేదు. ఎంతవారికైనా టికెట్ కావాలంటే అమ్మ దయ ఉండాల్సిందే. ఆమె పనితీరు, గెలుపు అవకాశాల పేరు చెప్పి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలో దాదాపు వందమందిని పక్కనపెట్టినా ఎవరూ పెద్దగా నిరసన వ్యక్తం  చేయకపోవటం విశేషం. పక్కన పెట్టిన వారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. టికెట్లు ఖాయమనుకున్న వారికి కూడా టికెట్ రాలేదు. అనామకులకు టికెట్లు ఇచ్చినా ఎవరూ నోరు మెదపరు. ముందస్తు సర్వేలు కూడా మళ్ళీ అమ్మదే 'పవర్' అని తేల్చాయి.

0/Post a Comment/Comments