జూనియర్ ఎన్టీఆర్ కారుకు ఫైన్ |
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారుకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. అమీర్‌పేటలో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలో కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్నందుకు ఈ ఫైన్ విధించారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏపీ 37 ఏఎక్స్ 9999 కారులో సారథి స్టుడియోకి వెళ్తున్నారు. 700 రూపాయల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కారుకు బ్లాక్ ఫిల్మ్ విషయమై జరిమానా విధించటం ఇది మూడో సారి.
Post a Comment