సరైన ఆధారాలు చూపించలేకపోయారు |
పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన దర్యాప్తు అధికారులు భారత అధికారులపై ఆరోపణలు చేశారు. పఠాన్ కోట్ పై దాడిని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులే చేశారని భారత అధికారులు నిరూపించలేకపోయారని అన్నట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు తెలిపాయి.
మార్చి 29న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించిన పాక్ అధికారులు తమను కేవలం 55 నిమిషాలు మాత్రమే ఎయిర్ బేస్ లోకి అనుమతించారని, తమకు ఆధారాలు సేకరించేందుకు వీలుకాలేదని తెలిపారు. భారత అధికారులు మాత్రం పాక్ దర్యాప్తు బృందానికి అన్ని విషయాలు సమగ్రంగా వివరించామని, ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాన్ని కూడా చూపించామని, ఆధారాలు కూడా అందజేశామని అంటున్నారు.

Post a Comment