మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు |
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. పెట్రోల్‌పై లీటర్‌కు 2.19 రూపాయలు, డీజిల్‌పై లీటర్‌కు 98 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవి గత రాత్రి నుండి అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ ధరల్లో ఉన్న మార్పుల కన్నా ఈ పెరుగుదల ఎక్కువగా ఉండటం విశేషం.
అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు కేంద్ర ప్రభుత్వం టాక్సులు పెంచి ఆదాయం తగ్గకుండా చూసుకుంది. ఇప్పడు టాక్సులు తగ్గించే విషయం మాత్రం ఆలోచించరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బిజెపి నేతలు టాక్సులు ఎక్కువగా ఉన్నాయని, తగ్గించాలని డిమాండ్ చేసారు. వీరు అధికారం లోకి వచ్చాక టాక్సులు పెరిగాయే కానీ తగ్గలేదు. ఇంధనం ధరలు దక్షిణాదిలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి.

Post a Comment