మధ్యాహ్నం 12 నుండి 3 వరకూ కూలి పనులు నిషేదించాలి

మధ్యాహ్నం 12 నుండి 3 వరకూ కూలి పనులు నిషేదించాలి
మధ్యాహ్నం 12 నుండి 3 వరకూ కూలి పనులు నిషేదించాలి
ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఉమ్మడి హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాలకు  కొన్ని ఆదేశాలు జారీ చేసింది. వేసవి కాలం ముగిసే వరకూ మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకూ కూలి పనులు నిషేదించాలని పేర్కొంది. పనిప్రదేశాల్లో నీడ కోసం షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. వీటిని ఉల్లంఘించే యజమానులను కఠినంగా శిక్షించాలని కూడా పేర్కొంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎండల పట్ల, వడ దెబ్బ కు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల  ప్రజలకు అవగాహన కల్పించే విధంగా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఒరిస్సా, ఇంకా ఇతర రాష్ట్రాలలో తీసుకునే జాగ్రత్తలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.  ఈ ఆదేశాలు జులై వరకూ పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది.

0/Post a Comment/Comments