ఉత్తరాఖండ్‌లో విశ్వాస పరీక్ష పై స్టే |
ఇవాళ ఉత్తరాఖండ్ శాసనసభలో నిర్వహించాల్సిన విశ్వాసపరీక్షను డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. దీనిని నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాక స్పీకర్ అనర్హత వేటు విధించిన తొమ్మిది మంది కాంగ్రెస్ రెబెల్ సభ్యులకు కూడా ఓటు వేసే అవకాశాన్ని సింగిల్ బెంచ్ కల్పించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బలపరీక్ష కోసం కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు రెబెల్, ఇండిపెండెంట్ సభ్యులను బుజ్జగించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా, విశ్వాసపరీక్షను డివిజన్ బెంచ్ వాయిదా వేసింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. నైనిటాల్‌లోని ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిష్త్ లతో కూడిన ఈ డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తూ, ఏప్రిల్ 7వ తేదీ వరకు విశ్వాసపరీక్షను వాయిదా వేసింది.
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉందనీ, రాష్ట్రపతి నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవనీ కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదించారు. న్యాయస్థానం రోహత్గిని ఒక్కరోజులో విశ్వాసపరీక్ష జరగనుండగా ఎందుకు రాష్ట్రపతి పాలన విధించారని అడిగింది. మీకు ఎందుకు అంత తొందర అని ప్రశ్నించింది. దానికి రోహత్గి సమాధానం చెప్పేందుకు సమయం కావాలని కోరారు.
బిజెపి నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు 91 సార్లు రాష్ట్రపతి పాలన విధించిన కాంగ్రెస్ కు ఇప్పుడు బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. కేంద్రానికి మిత్రపక్షమైన శివ సేన కూడా రాష్ట్రపతి పాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే సభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందక పోవటంతో రాష్ట్ర ఖర్చుల కోసం కేంద్రం ఆర్డినెన్సు జారీ చేసే అవకాశం ఉంది.

Post a Comment