Tv9 చేతులు మారనుందా? |
Tv9 తొలిదశ తెలుగు న్యూస్ ఛానెల్లలో ఒకటి. ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ఈ చానెల్ సొంతం. తెలుగులో Tv9 తర్వాత ఎన్నో న్యూస్ ఛానెళ్లు ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ Tv9 కు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. అలాంటి న్యూస్ చానెల్ ఇప్పుడు చేతులు మారబోతుందా? అవును. ఇప్పుడు ఈ న్యూస్ చానెల్ శ్రీని రాజు చేతుల్లోంచి జూపల్లి రామేశ్వరరావు చేతుల్లోకి వెళ్ళబోతుంది. ఇతను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సన్నిహితుడవటమే కాకుండా మైహోమ్ బిల్డర్స్, మహా సిమెంట్స్ వంటి సంస్థలకు అధిపతి.
తెలుగులోనే కాకుండా Tv9 కు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ వుంది. ఈ సంస్థ కన్నడ, మరాఠీ , గుజరాతీ, మలయాళ భాషా న్యూస్ చానెళ్ళ తో పాటు ఇంగ్లీష్ చానెల్ న్యూస్ 9 ను కూడా నిర్వహిస్తుంది. ఇటు తెలంగాణలో నడుస్తున్న జై తెలంగాణ కూడా ఈ గ్రూప్‌దే. గత కొన్ని సంవత్సరాలుగా Tv9 చేతులు మారబోతోందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు 650 కోట్ల భారీ మొత్తానికి ఈ డీల్ జరిగినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల అనంతరం Tv9 తెలంగాణ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంది. ఏబీఎన్‌తో పాటు టీవీ-9 ఛానెల్‌పై కేబుల్ ఆపరేటర్లు నిషేధం విధించారు. అయితే తర్వాత Tv9 తాము ప్రసారం చేసిన కథనాలకు క్షమాపణ చెప్పుకుని మళ్లీ తన ప్రసారాలు పునరుద్ధరించుకుంది. ఇప్పుడు తెలంగాణా వారి చేతుల్లోకే ఈ చానెల్ వెళ్ళిపోబోతుంది.

Post a Comment