22500 కిలోమీటర్ల మేర ఫైబర్ గ్రిడ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ |
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న 22500 కిలోమీటర్ల ఫైబర్ గ్రిడ్ నెట్ వర్క్ ను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం లో ప్రారంభించారు. సిస్కో సిస్టమ్స్ ఈ గ్రిడ్ కు అవసరమైన సాంకేతిక సహాయం అందించనుంది. దీనితో 1.3 కోట్ల ఇళ్ళను అనుసంధానించనున్నారు
కేంద్ర ప్రభుత్వం National Optic Fiber Network లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైలట్ ప్రాజక్ట్ కోసం ఎంపిక చేసింది.333 కోట్లతో మొదట విశాఖ జిల్లా లో మొదలవనున్న ఈ నెట్ వర్క్ జులై తర్వాత ఇతర జిల్లాలకు విస్తరించనుంది. రాష్ట్ర ప్రజలకు చౌక ఇంటర్నెట్ సేవలందించటమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీని ద్వారా 15 Mbps ఇంటర్నెట్ 149 రూపాయలకు, 100 Mbps ఇంటర్నెట్ 999 రూపాయలకు అందించనున్నారు.
We're providing Internet through APSFL at Rs.149/month for a 15 Mbps line to households & offices will get 100 Mbps line at Rs.999/ month.— N Chandrababu Naidu (@ncbn) March 17, 2016
Post a Comment