![]()  | 
| ఉత్సాహంగా జానారెడ్డి ప్రసంగం | 
తెలంగాణ వచ్చేవరకు కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ప్రసంగం అన్నా, విలేఖరుల తో సమావేశం అన్నా, ఆయన ఏం చెబుతున్నారో జనాలకు గానీ, పత్రికల వారికి గానీ అంతగా అర్థమయ్యేది కాదు. అలా కావాలనే మాట్లాడే వారేమో తెలియదు. 
కానీ ఈమద్య శాసన సభలో మాత్రం సూటిగా, అద్బుతంగా మాట్లాడుతున్నారు. ఇవ్వాళ సభలో జానా మాట్లాడిన వాటిలో ముఖ్యాంశాలు
కానీ ఈమద్య శాసన సభలో మాత్రం సూటిగా, అద్బుతంగా మాట్లాడుతున్నారు. ఇవ్వాళ సభలో జానా మాట్లాడిన వాటిలో ముఖ్యాంశాలు
- ప్రభుత్వం జీవోల వివరాలు తెలియజేసే వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం మూసివేసిందని, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనీ దీనిని వెంటనే తిరిగి తెరువాలి.
 - 2014-15 బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం లో కేవలం 60 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్‌లో కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్టు చూపిస్తున్నారు, ప్రభుత్వానికి అంత ఆదాయం లేదు అంత ఖర్చు పెట్టలేరు.
 - ప్రాణహిత ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో ప్రభుత్వం అధ్యయనం జరిపించాలి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
 
జానా విమర్శలు చేస్తున్నప్పటికీ ఆర్థిక మంత్రి ఈటెలతో సహా అధికార పక్ష సభ్యులందరూ కూడా ఎక్కడా అడ్డుపడకుండా, నిశ్శబ్దంగా ప్రసంగాన్ని వింటూ నోట్ చేసుకోవటం గమనార్హం. 

Post a Comment