ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి |
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత జయకృష్ణ ఇవాళ హైదరాబాద్ లో కన్నుమూశారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నటులు కృష్ణంరాజు, జయసుధ లకు మేకప్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
మన ఊరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు, సీతారాములు, వివాహభోజనంబు, కృష్ణార్జునులు, దాసు వంటి చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా మొత్తం 15 తెలుగు సినిమాలు, 22 డబ్బింగ్ సినిమాలు చేసారు. మన ఊరి పాండవులు చిత్రానికి గాను ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఈయన కుమారుడు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకున్నారు.

Post a Comment